అనిల్ రావిపూడికి ఖరీదైన కానుకను ఇచ్చిన దిల్ రాజు

ఏ వర్గం ప్రేక్షకులు ఏ కథాంశాలను ఇష్టపడతారో .. అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్ కి రప్పించాలంటే ఆ కథాంశం ఎలాంటిదై ఉండాలనే విషయంలో దిల్ రాజుకి పూర్తి క్లారిటీ వుంది. అందువల్లనే ఆయన ఖాతాలో ఎక్కువ విజయాలు కనిపిస్తాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఆయన 'ఎఫ్ 2' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా భారీ లాభాలను తీసుకురావడంతో, ప్రొడక్షన్ టీమ్ ను ఆయన బ్యాంకాక్ పంపించారు. ఇందుకోసం ఆయన 50 లక్షల వరకూ ఖర్చు చేసినట్టుగా చెప్పుకున్నారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా టీమ్ కి 'ఐ ఫోన్' లు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది. తనకి ఓ స్పెషల్ గిఫ్ట్ అందిందని అనిల్ రావిపూడి చెప్పాడు. ఆయన అందుకున్న కానుక 'బీఎం డబ్ల్యూ' కారు అని చెప్పుకుంటున్నారు. త్వరలో మహేశ్ బాబుతో అనిల్ రావిపూడి చేసే సినిమాకి కూడా దిల్ రాజు నిర్మాత అనే సంగతి తెలిసిందే.
Go Back to Shorts
dil raju
anil ravipudi

More Telugu News